9, ఏప్రిల్ 2013, మంగళవారం

మన కర్తవ్యం



అబ్బా..... ఎంత వేడిగా ఉంది ఇవ్వాళ!!!!!!!!!!! రాను రాను ఎండలు మండిపోతున్నాయి.  ఏమిటో కలికాలం !!! సకాలంలో వర్షాలు పడటంలేదు, పంటలు పండట్లీదు. పండినా అకాల వర్షాలొకటి. ఏంటో విడ్డూరం.

ఇలాంటి మాటలు ఈ మధ్య కాలం మనం తరచూ వింటూనే ఉన్నాం.  ఇలా అనుకోవడమే కానీ దీనికి గల కారణాల గురించి మాత్రం మనం ఆలోచించం.  

మనకు మన ఇల్లు ఎంతో అందంగా అధునాతనంగా కనిపించాలి.  ఇంటి చుట్టూ లాన్ వేస్తాం, పూల మొక్కలు పెంచుకుంటాం.  కాని ఇంటి ఆవరణ లో చెట్టు మాత్రం కనిపించదు. పోనీ బయట చూద్దామా అంటే మన ప్రభుత్వం వారు రోడ్ల extension అనీ, పైప్ లైన్ పనులని అదనీ, ఇదనీ ఎక్కడికక్కడ చెట్లను కొట్టేస్తున్నారు.  పెరుగుతున్న జనాభా వల్ల అడవులను clear చేసి అక్కడ ఇళ్ళ స్థలాలు, ఇతర భవనాలు కట్టేస్తున్నాం. 

మరి అలాంటప్పుడు మనకు గాలి, నీడ ఎక్కడనుండి వస్తాయి? పోనీ ఉన్న గాలినైనా స్వచ్చంగా ఉంచుతున్నమా అంటే అదీ లేదు. పరిశ్రమల నుండి వచ్చే పొగతో, వాహనాల పొగతో గాలిని  కలుషితం చేసేస్తున్నాం.  పరిశ్రమల కన్నా మన వాహనాల వల్లనే గాలిలో కాలుష్యం ఎక్కువవుతోంది.  పక్క వీధిలో ఉన్న ఫ్రండ్ ని కలవాలంటే బండిలోనే వెళ్ళాలి, వీధి చివర ఉన్న అంగడికి వెళ్ళాలన్నా బండి తీస్తాం.  ఇలా చేయడం మనకి ఎంత సౌకర్యవంతమో వీటి పొగవల్ల మనం పీల్చె గాలిలో చేరే కాలుష్యం ద్వారా మన ఆరోగ్యానికి అంతే హానికరం.  కాలుష్యం అనే కాదు ప్రతి దానికి ఇలా బండిలో వెళ్ళడం వల్ల మనం నడకకు దూరమవుతున్నాం. దీనితో శరీరానికి తగిన వ్యామం లేక లేనిపోని జబ్బులు వస్తున్నాయి. 

మనం నడిచి వెళ్ళగలిగే దూరంలో ఏ పనికైనా సాధ్యమైనంత వరకు నడిచి వెళ్ళడానికి ప్రయత్నించండి.  దీనివల్ల పర్యావర్నానికే కాదు, మన శరీరానికి కూడా ఎంతో మేలు.  

దయచేసి చెట్లని కొట్టేయకండి.  ఇలా చేయడం వల్ల మనకు జరిగే నష్టం కన్నా మన భవిష్యత్తరాలు ఎక్కువ నష్టపోతాయి.  ఇప్పుడు ఉండే పరిస్థితి ఇలానే కొనసాగితే ఒక 20 - 30 సంవత్సరాల తరువాత ఎడారి వాతావరణం అయ్యే అవకాశాలు ఉన్నాయి. 

మన పిల్లలు అలాంటి వాతావరణంలో ఉండటం మనం భరించగలమా? లేదు.   కాని మనం ఇలా చెట్లను నరుక్కుంటూ పోతే మన పిల్లలకు భవిష్యత్తులో మనం ఇవ్వబోయే బహుమానం అదే.  

ప్రతి ఒక్కరూ మన కర్తవ్యంగా  ఒక చెట్టును నాటండి.  అది కాస్త పెద్ద అయ్యేవరకు - అంటే ఒక్క సంవత్సరం పాటు దాని పోషణ బాధ్యత తీసుకోండి.  ఆ తరువాత వాటి పోషణ అవే చూసుకుంటాయి.  మన పిల్లల కోసం ఈ చిన్న పని చేయడం మనకు సమస్య కాదు కదా. 

దయచేసి చెట్లను నాటండి - పర్యావరణ కాలుష్యాన్ని నివారించండి - భూమిని అగ్ని గుండంగా మారకుండా ఆపండి . 


5 కామెంట్‌లు: