24, నవంబర్ 2013, ఆదివారం

ఎటుపోతున్నాం   మనం

ఏమౌతోంది జీవన గమనం

ఆశల వెంట మన పయనం

మానవ విలువల తిరోగమనం

బోసి నవ్వుల చిరుమొగ్గల చిరు ప్రాయం

రక్కసి చేసెను గాయం

కమ్ముకుందా విషవలయం  


12, ఆగస్టు 2013, సోమవారం

రాగ సాగరంలో ...... కోటి రాగాలున్నా .......... 
మానస వీణియపై .. 
భానోదయ వేళలో ...... నీ సరస సరాగాలను ,
చంద్రోదయ వేళలో .......నీ ప్రణయ రాగాలను ,
నువ్వు పంచిన అనురాగాలను ,
పలికిస్తున్నది నా ... హృదయ రాగం 

10, ఆగస్టు 2013, శనివారం

మల్లెల పరిమళాలు
మదిలో నిలుపు ఎన్నో మధుర జ్ఞాపకాలు
పొత్తిళ్ళ వయసులో నిదురపుచ్చు వేళ
అమ్మ జడలోని మల్లెల పరిమళం
పసిపాపగ ఉన్నప్పుడు
అమ్మ వేసిన మల్లెపూ జడల జ్ఞాపకం
పసిడి వన్నెల వయసులో
మనసు దోచిన చెలికాని చిలిపి జ్ఞాపకం 

26, జూన్ 2013, బుధవారం

ఎవరు నువ్వు????

కనుల నిండా ఎన్ని కలలు...!

మనసు నిండా ఎన్ని ఊహలు... !!

నీ పెదవులపై చిరునవ్వునవ్వాలని కలలు కన్నాను 

నీ చూపులోని సంతృప్తి గా నే మారాలనుకున్నాను 

నీ చేతులలోని లాలిత్యాన్ని అవ్వాలనుకున్నా 

నీ స్పర్సలోని ప్రేమ గా నే మారిపోవాలనుకున్నా 

నీ జీవితంలోని ప్రతి అడుగులోనూ నేనుం డాలనుకున్నా 

నీ తోడు నీడనై నీలోనే ఒదిగి పోవాలనుకున్నా .... 

కానీ ఇప్పుడు ....... 

నా ప్రపంచమే నీవైనావు 

నాలోని ప్రతి కదలికా నీవే 

నా సంతోషం, దుఃఖం, ఆనందం, ప్రేమ అన్ని నీవే  అయినావు 

నేనే నీవుగా మారిపోయాను 

నీవు లేని జీవితం ఊహించలేకున్నాను 


ప్రియతమా............... ఏమని పిలువను నిన్ను??

నా నీడవననా.........?

నువ్వు అనే వెలుగు లేనప్పుడు ఆ నీడ కానరాదే !!?!

నా ఊపిరివననా .....?

అది ఏదో ఒకరోజు ఆగిపోతుందే !!!!!

నా ప్రాణమే నీవననా ............?

అది కుడా ఏదో ఒకరోజు నన్ను వదిలి వెళ్ళిపోతుంది !!!!!!!!!

నేస్తమా ................... 

మరి ఎవరు నువ్వు?????

ఏమని పిలువను నిన్ను?????

9, ఏప్రిల్ 2013, మంగళవారం

మన కర్తవ్యం



అబ్బా..... ఎంత వేడిగా ఉంది ఇవ్వాళ!!!!!!!!!!! రాను రాను ఎండలు మండిపోతున్నాయి.  ఏమిటో కలికాలం !!! సకాలంలో వర్షాలు పడటంలేదు, పంటలు పండట్లీదు. పండినా అకాల వర్షాలొకటి. ఏంటో విడ్డూరం.

ఇలాంటి మాటలు ఈ మధ్య కాలం మనం తరచూ వింటూనే ఉన్నాం.  ఇలా అనుకోవడమే కానీ దీనికి గల కారణాల గురించి మాత్రం మనం ఆలోచించం.  

మనకు మన ఇల్లు ఎంతో అందంగా అధునాతనంగా కనిపించాలి.  ఇంటి చుట్టూ లాన్ వేస్తాం, పూల మొక్కలు పెంచుకుంటాం.  కాని ఇంటి ఆవరణ లో చెట్టు మాత్రం కనిపించదు. పోనీ బయట చూద్దామా అంటే మన ప్రభుత్వం వారు రోడ్ల extension అనీ, పైప్ లైన్ పనులని అదనీ, ఇదనీ ఎక్కడికక్కడ చెట్లను కొట్టేస్తున్నారు.  పెరుగుతున్న జనాభా వల్ల అడవులను clear చేసి అక్కడ ఇళ్ళ స్థలాలు, ఇతర భవనాలు కట్టేస్తున్నాం. 

మరి అలాంటప్పుడు మనకు గాలి, నీడ ఎక్కడనుండి వస్తాయి? పోనీ ఉన్న గాలినైనా స్వచ్చంగా ఉంచుతున్నమా అంటే అదీ లేదు. పరిశ్రమల నుండి వచ్చే పొగతో, వాహనాల పొగతో గాలిని  కలుషితం చేసేస్తున్నాం.  పరిశ్రమల కన్నా మన వాహనాల వల్లనే గాలిలో కాలుష్యం ఎక్కువవుతోంది.  పక్క వీధిలో ఉన్న ఫ్రండ్ ని కలవాలంటే బండిలోనే వెళ్ళాలి, వీధి చివర ఉన్న అంగడికి వెళ్ళాలన్నా బండి తీస్తాం.  ఇలా చేయడం మనకి ఎంత సౌకర్యవంతమో వీటి పొగవల్ల మనం పీల్చె గాలిలో చేరే కాలుష్యం ద్వారా మన ఆరోగ్యానికి అంతే హానికరం.  కాలుష్యం అనే కాదు ప్రతి దానికి ఇలా బండిలో వెళ్ళడం వల్ల మనం నడకకు దూరమవుతున్నాం. దీనితో శరీరానికి తగిన వ్యామం లేక లేనిపోని జబ్బులు వస్తున్నాయి. 

మనం నడిచి వెళ్ళగలిగే దూరంలో ఏ పనికైనా సాధ్యమైనంత వరకు నడిచి వెళ్ళడానికి ప్రయత్నించండి.  దీనివల్ల పర్యావర్నానికే కాదు, మన శరీరానికి కూడా ఎంతో మేలు.  

దయచేసి చెట్లని కొట్టేయకండి.  ఇలా చేయడం వల్ల మనకు జరిగే నష్టం కన్నా మన భవిష్యత్తరాలు ఎక్కువ నష్టపోతాయి.  ఇప్పుడు ఉండే పరిస్థితి ఇలానే కొనసాగితే ఒక 20 - 30 సంవత్సరాల తరువాత ఎడారి వాతావరణం అయ్యే అవకాశాలు ఉన్నాయి. 

మన పిల్లలు అలాంటి వాతావరణంలో ఉండటం మనం భరించగలమా? లేదు.   కాని మనం ఇలా చెట్లను నరుక్కుంటూ పోతే మన పిల్లలకు భవిష్యత్తులో మనం ఇవ్వబోయే బహుమానం అదే.  

ప్రతి ఒక్కరూ మన కర్తవ్యంగా  ఒక చెట్టును నాటండి.  అది కాస్త పెద్ద అయ్యేవరకు - అంటే ఒక్క సంవత్సరం పాటు దాని పోషణ బాధ్యత తీసుకోండి.  ఆ తరువాత వాటి పోషణ అవే చూసుకుంటాయి.  మన పిల్లల కోసం ఈ చిన్న పని చేయడం మనకు సమస్య కాదు కదా. 

దయచేసి చెట్లను నాటండి - పర్యావరణ కాలుష్యాన్ని నివారించండి - భూమిని అగ్ని గుండంగా మారకుండా ఆపండి . 


2, మార్చి 2013, శనివారం

కనుల చాటు కలలు ఎన్నో
 పెదవి దాటని పలుకులెన్నో

 మనసు చాటు ఊసులెన్నో
తెలుపలేని  భావాలెన్నో

వికసించిన పెదవి చాటున
దాగివున్న బాధలెన్నో

కనులు చూడలేనివి
మనసు చూడగలదు

నువ్వు వెళ్ళలేని ప్రదేశాలకు సైతం
మనసు వెళ్ళగలదు.

కనులు మోసపొవునెమో కాని
మనస్సు కాదు

కనుక

మనస్సుతో చూడు
మనస్సు మాట  ఆలకించు 







17, ఫిబ్రవరి 2013, ఆదివారం

మధురం..........!!!!!!!!

మధురం మధురం
  నీ ఊహలు మధురం

నీ పలుకులు మధురం,
  నీ చిరునవ్వులు మధురం

నీ కోపం మధురం
 ఆ అలకలు మధురం

నీతో గొడవలు మధురం
  నీ లాలిత్యం మధురం

నీ తలపులు మధురం
 నీ సాన్నిధ్యం మధురం

చేరువైన వేళ  నీ అల్లరి మధురం
చెంత లేని వేళ నీ విరహం మధురం

నువ్వందించే స్నేహం మధురం
 నువ్వు కురిపించే ప్రేమ ఇంకెంతో మధురం