9, డిసెంబర్ 2012, ఆదివారం

ఓ మనసా...................!!!!!!!!!!!!!!!!!!


ఓ మనసా ఎంత పిచ్చి దానివే నువ్వు.
  ఇంతలోనే సంతోషం,  అంతలోనే ధుఃఖం 
క్షణాల్లో ఉప్పొంగుతావు, 
   చిన్న మాటకే కృంగిపోతావు.
నన్నెంతో ధైర్యవంతురాలిలా నిలబెడతావు 
    అంతలోనే  నన్ను పిరికిదాన్ని చేస్తావు.

ఇప్పుడేమైందని నీకంత  దిగులు?

తనే నా జీవితమని చెప్పావు....
నాలో సగమని మురిపించావు.....
అతనే నా ప్రాణమని నమ్మించావు......
నా ఊపిరే తను అయినప్పుడు,
తను ఆ శరీరాన్ని విడిచినంత మాత్రాన 
తను లేడు అని నన్నెలా నమ్మమంటావు?
నా శరీరంలో సగం తనది కాదా?
నే తీసుకునే ప్రతి శ్వాస లోనూ తను ఉన్నాడు.
కాదంటావా?
నా ప్రతి మాట లోనూ చేతలోనూ 
ప్రతి కదలికలోనూ తను జీవించే ఉన్నాడు.
మరి అలాంటప్పుడు ఎందుకు దిగులుపడతావు?
నిన్నటికి ఈరోజుకు ఏమిటి తేడా?
నిన్న తను నీ పక్కన ఉన్నాడు ; 
నేడు తను నీలోనే ఉన్నాడు. అంతే కదా !!!!!
  

4 కామెంట్‌లు:

  1. "మనిషిపొతే మత్రమేమి మనసు ఉంటది
    మనసుతోటి మనసెపుడో కలసిపోతది"
    ఒక పాత పాటలోని ఈ లైన్స్ గుర్తుకు తెచ్చింది మీ ఈ టపా!

    రిప్లయితొలగించండి
  2. ఎందుకో బాధగా అనిపించింది చదువుతుంటే...
    పోయాక ఉన్నారనుకుని పడేది ఎదో తృప్తికోసమే తప్ప...నిజంగా ఆ బాధ వద్దు.

    రిప్లయితొలగించండి
  3. చిన్ని ఆశ గారు,

    స్వాగతం అండి. ఔనండి ఆ బాధ ఎవరికి వద్దు. కానీ బాధపడుతూ ఉండె కన్న మనసును ఎదో విధంగా తృప్తి పరచడమె మంచిది కదా. తృప్తి లేకుండా జీవించడం చాలా కష్టం.

    రిప్లయితొలగించండి