3, డిసెంబర్ 2012, సోమవారం

మనసు పలికే

ఇది నా తొలి పోస్ట్.  జీవితం లో ఎన్నో ఆనందాలు, అనురాగాలు, ఆత్మీయతలు, అనుబంధాలు. కొన్ని మరపురానివి, కొన్ని మరువలేనివి. కొన్ని పరిచయాలు, స్నేహాలు; తలవగానే చిరునవ్వు కలిగించేవి కొన్ని, కళ్ళలో కాంతుల్ని నిమ్పేవి కొన్ని. మనస్సుకి కొత్త ఉత్తేజాన్ని, ధర్యాన్ని ఇచ్చే జ్ఞాపకాలు కొన్ని అయితే, మనస్సు మోయలేని భారాన్ని, విషాదాన్ని నిమ్పేవి కొన్ని.   

మన జీవిత ప్రయాణంలో ఎందఱో వ్యక్తులు తారస పడుతూ ఉంటారు. మల్లె పూవు లాగ సువాసనను పంచె వారు కొందరైతే, ఎన్నెన్నో వర్ణాలతో కనువిందు చేసే గులాబి పూవులాంటి వారు మరికొందరు.  ఆహ్లాదాన్ని కలిగించడం మాత్రమె కాదు తలుచుకుంటే గాయపరచనూగలము అనే గులాబి ముళ్ళు లాంటి వారు కొందరు.  ఎదలోతుల్లో ఎన్నటికి చెదిరిపోని ఆకుపచ్చని జ్ఞాపకం లాంటి వారు కొందరు.

ఇలాంటి ఎన్నో సంఘటనల, వ్యక్తుల జ్ఞాపకాల ఝారి లో కొట్టుమిట్టాడే మనసు పలికే ఊసులే ఈ నా బ్లాగు.


9 కామెంట్‌లు:

  1. Mahalsa గారు తెలుగు బ్లాగుల ప్రపంచానికి సుస్వాగతం అండి..

    రిప్లయితొలగించండి
  2. స్వాగతం సుస్వాగతం :)

    కామెంట్ పోస్ట్ చేసేముందు "దయచేసి మీరు రోబోట్ కాదని నిరూపించండి" అని వస్తోంది... అది కొంచెం ఇబ్బందిగా ఉంది అండి :)...

    రిప్లయితొలగించండి